ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం ఆయన తన గదికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. ఉదయం పది గంటలకు భార్యతో కలిసి టిఫిన్ చేసిన ఆయన మొదటి అంతస్తులో ఉన్న తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. కాసేపటి తర్వాత డోర్ లాక్ చేసినట్లు గుర్తించి, భార్య తలుపులు తెరవాలని ఎంత పిలిచినా బయటకు రాలేదు. గన్ మెన్ సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకున్న కోడెలను కారులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.ఈ ఆత్మహత్యపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని నేరుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది (కోడెలది) ఆత్మహత్య కాదని, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణ హత్య అని సంచలన ఆరోపణలు చేశారు.
#Somireddy
#FormerspeakerKodelaSivaPrasad
#BasavatarakamHospital
#Chandrababu
#tdp
#demise
#assembly
#kesineninani